నాకు ఇవే చివ‌రి ఎన్నిక‌లు : ‌సీఎం

బిహార్ సీఎం నితీశ్ కుమార్ పెను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మాట్లాడిన ఆయన మాట‌ల వెనుక ఉన్న బాధ మాత్రం తెలియ‌న‌ది. ఇంత‌కి ఆయ‌న ఏం అన్నారు అని అనుకుంటున్నారా ?. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగింపు పడుతున్న వేళ ఆఖరి క్షణంలో ఆయ‌న సంచలన ప్రకటన చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. ముగింపు బాగుండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జేడీయూకే మరోసారి మద్దతు తెలిపి అధికారాన్ని అందించాల్సిందిగా ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారం ముగుస్తుందనడానికి చివరి గంటల్లో బిహార్ ముఖ్యమంత్రి సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.