కేసీఆర్ అనుచ‌ర‌లే చెరువుల‌ను క‌బ్జా చేశారు : ‌రేవంత్ రెడ్డి

తెరాస పార్టీ మీద ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గులాబీ స‌ర్కార్ వ‌చ్చాకా కేసీఆర్ అనుచరులు చెరువులను అక్రమించి, లే అవుట్లు చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితంగానే హైదరాబాద్ లోని కాలనీలు వరదమయం అయ్యాయని అన్నారు. 120మంది వరకు వరదల్లో మరణించారని..ఇవన్నీ ప్రభుత్వ హత్యాలేనని స్పష్టం చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ కు ఉపద్రవం వచ్చిందన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ అసమర్థతేనన్నారు. ముంపు బాధితులకు సహయంలో దోపిడీ జరిగిందన్నారు. 5వేలు బాధితుల నుంచి లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. వరద సాయం నిధుల్లో 200కోట్లు TRS నేతలు దోచుకున్నారని అన్నారు. ప్రభుత్వం నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అవినీతికి ఆస్కారం ఉండేది కాదని సూచించారు. ఎంపీగా ఉన్న నాకు సాయం పంపిణీ సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు రేవంత్.