దీపావళి తర్వాతే గ్రేటర్ ఫైట్
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల మీద ఓ అవగాహాన వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ఈ నెల 13న రానున్నట్లు తెలిపింది. అంతేకాదు నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లకు 150 మంది ఆర్ ఓలను నియమించినట్టు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. ప్రతి వార్డుకు సగటున 50 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 30 వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయన్నారు.