అతడితోనే పునర్నవి పెళ్లి
హీరోయిన్, బిగ్‌బాస్3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం ఫెళ్లి ఫిక్సయ్యింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. “ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్” అంటూ తనకు ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని ప్రకటించింది. ఈ ఫొటోలోనే ఆమె చేయిని మరో చేయి పట్టుకుని ఉంది. ఆ చేయి ఎవరదనేది మాత్రం పునర్నవి చెప్పలేదు. నిజానికి బిగ్‌బాస్ సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్‌ట్రాక్ నడిచింది. ప్రేక్షకులంతా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని అనుకున్నారు. పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరికీ ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ ఇద్దరూ అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమని చెబుతూ వచ్చారు. ఏదైతేనేం పునర్నవి త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది.