ప్రభుత్వ మెడలు వంచుతా : జయ సారధి రెడ్డి

ప్రభుత్వం మెడలు వంచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి. జనగామ TPTF నిరసన ధర్నాలో మాట్లాడుతూ తెరాస సర్కార్ వచ్చిన నాటి నుండి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శలు చేశారు. చట్ట సభల్లో ప్రశ్నించే వారు లేక వారు ఆడింది ఆట గా సాగుతుంది అని పేర్కొన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా వారి సమస్యలు తెలుసని అన్నారు.