బండి సంజ‌య్‌ని అందుకే చంపాల‌ని ప్లాన్ వేశారు- రేవంత్ రెడ్డి

బీజేపీ నేత‌లు కొంద‌రితో టీఆర్ఎస్ నేత‌ల‌కు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి.

సిద్ధిపేట ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రిగా క‌లెక్ట‌ర్, సీపీని పిలిపించి మాట్లాడే అధికారం కిష‌న్ రెడ్డికి ఉన్నా ఎందుకు ఆ ప‌ని చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. బండి సంజ‌య్ ను విద్యాసాగ‌ర్ రావు, ముర‌ళీధ‌ర్ రావు ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేదో అర్థం చేసుకోవాల‌న్నారు. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకే కేంద్ర బ‌ల‌గాల‌తో ర‌క్ష‌ణ క‌ల్పించిన కేంద్రం… బండి సంజ‌య్ కు ఆ ప‌ని చేయ‌లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మొద‌టిసారి క‌రీంన‌గ‌ర్ లో బండి సంజ‌య్ పై పోలీసులు దాడి చేసిన రోజే చ‌ర్య‌లు తీసుకుంటే ఇప్పుడు ప‌రిస్థితి చంపే వ‌ర‌కు వ‌చ్చి ఉండేది కాద‌న్నారు. డ‌బ్బులు ఎవ‌రి ఇంట్లో దొరికినా ర‌ఘునంద‌న్ రావువే అని ప్ర‌చారం చేస్తున్నారు కానీ రావు అంటే హ‌రీష్ రావు బంధువు కూడా కావొచ్చు క‌దా అన్నారు. కిందిస్థాయి కార్య‌క‌ర్త‌లు కొట్లాడుతుంటే కొంద‌రు పెద్ద నేత‌లు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో క‌లిసి ఉన్నార‌ని… ఇన్నాళ్లు బీజేపీకి మేం చెప్తే అర్థం కాలేదు ఇప్పుడు స్వ‌యంగా తెలిసొస్తుంద‌న్నారు. బండి సంజ‌య్ వ‌ల్ల శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య వ‌స్తే హ‌రీష్ రావు వల్ల రాదా అని రేవంత్ ప్ర‌శ్నించారు. డ‌బ్బులుంటే సోదాలు చేయాల్సింది ఐటీ శాఖ అయితే పోలీసుల‌కు సోదాలు చేయాల్సిన అధికారం ఎవ‌రిచ్చార‌ని రేవంత్ నిల‌దీశారు.