బీజేపీలోకి విజయశాంతి ?
కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్రచారకర్త విజయశాంతి పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో భారతీయ జనతా పార్టీలోకి వస్తుందని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్రెడ్డి పావులు కదుపుతున్నారని సమాచారం. ఇందులో భాగంగానే విజయశాంతి ఇంటికి వెళ్లి కిషన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారని బోగట. అయితే ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కానీ రాజకీయ వర్గాలలో మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా, సీఎం సొంత జిల్లాలో బీజేపీ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. అందుకే దుబ్బాక ఎన్నికల్లో కేంద్రం కూడా ఓ కన్నూవేసింది. తప్పకుండా విజయం సాధించాలని, ఈ విజయం తరువాత విజయశాంతి కూడా పార్టీ మారుతున్నట్లు సమాచారం.