గడ్డపార కాల్చి వాత పెడతాం : బాబుమోహన్
తెరాస నాయకులపై, ముఖ్యమంత్రి, మంత్రులపై మండి పడ్డారు బీజేపీ సీనియర్ నాయకుడు బాబుమోహన్. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగగంగా ఆయన తెరాస సర్కర్ పై నిప్పులు చెరిగారు. ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలని కేంద్రం గమనిస్తుంది అని అన్నారు. సమయం వచ్చినప్పుడు అందరి భాగోతం బయటపడుతుంది పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ సర్కారు కి, హరీష్ రావు కి గడ్డ పార కాల్చి వాత పెడుతారు అని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు బులెట్ లాంటి రఘునందన్ అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.