నాన్న బాగానే ఉన్నాడు
కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారిందని, ఆయన త్వరగా కోలుకోవాలని దయచేసి ప్రార్థనలు చేయండని కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన శివాత్మిక తాజాగా మరో ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయం వద్దని సూచించింది.
`మీ ప్రేమకు, అభిమానానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. క్రమంగా మెరుగవుతోంది. మాకు కావాల్సింది మీ ప్రార్థనలు మాత్రమే. ఆయన ఆరోగ్యం విషయంలో భయం వద్దు. తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యవద్ద`ని శివాత్మిక కోరింది.