మా తడాఖా చూపిస్తాం : హర్షవర్ధన్
కరోన వ్యాప్తి ప్రారంభం నుండి జీత భత్యాలు లేకుండా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిన ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని లెక్చరర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసింది బీజేపీ పార్టీ. బీజేవైఎమ్ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రులు గొప్పలు చెబుతున్నారు అని విమర్శించారు. కేంద్రం ఏమి సాయం చేయడం లేదు అని విష ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. దమ్ముంటే ప్రయివేటు టీచర్లు సర్కారు నుండి ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి వచ్చే సాయం పై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఇక చూస్తూ ఊరుకోమని మా తడాఖా ఏంటో రుచి చూపిస్తామని సవాల్ విసిరారు.