మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన భాజపా నాయకులు
గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మెదక్ జిల్లా బీజేవైఎమ్ అధ్యక్షులు రమాకాంత్ ఆద్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ నేతృత్వంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సాయం రాష్ట్రం నుంచే అందుతుందని, కేంద్రం ఏం పాయం చేయడం లేదని తెరాస మంత్రులు చెప్పడం సిగ్గుచేటన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. అంతేకానీ ఉకదంపుడు ఉపాన్యాసాలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టడం సరికాదన్నారు.