అలుగు పోస్తున్న హల్ది ప్రాజెక్టు

ఫోటో : నరేష్ యాదవ్, ధరిపల్లి

మెదక్ జిల్లాలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. దీనితో జిల్లాలో లోని ప్రముఖ ప్రాజెక్టు హల్ది రిజర్వాయర్ అలుగు పారుతుంది. ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అయిన హాకింపెట్, అచ్చంపేట, ధరిపల్లి గ్రామాల్లోని చెరువులు కూడా జలతరం సంతరించుకున్నాయి. గత వారం రోజులుగా ఆయా చెరువులు అలుగు పారుతుండడంతో గ్రామ ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వానలు ఎప్పుడు కురవలేదని ధరిపల్లి గ్రామ ప్రజలు చెబుతున్నారు. వానాకాలం, యాసంగి మరియు వచ్చే వాన కాలం వరకు పంటలకు కావాల్సిన నీరు అందుబాటులో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రాజెక్టు కుడి కాలువ పరివాహక ప్రాంతం ధరిపల్లి లో ఓ చోట కాలువకు గండి పడి పంట నష్టం జరిగిందని సమాచారం. వారిని సర్కార్ ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.