రాజక్కపేటలో ఇంటింటికి ప్రచారంలో చొప్పరి జయశ్రీ
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ మహిళ నాయకురాలు చొప్పరి జయశ్రీ. ప్రచారంలో భాగంగా రాజక్క పేటలో ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ లో సీఎం ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని విమర్శించారు. తన బిడ్డ ఎంపీ ఎన్నికలలో ఓడిపోయి ఏడాది కాకముందే మళ్ళీ ఎమ్మెల్సీ చేశారని పేర్కొన్నారు. మన బిడ్డలు చదువుకుంటే ఒక్క సర్కార్ నౌకర్ ఇయ్యలేడు అని ఆరోపించారు. దమ్ము లేక మాట్లాడలేని అభ్యర్థిని వాళ్ళు నిలబెట్టుకున్నారు అని అన్నారు. ఈ సారి దుబ్బాకలో కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు.