నాగలి పట్టిన ఐపిఎస్

అతనో ఐపీఎస్ అధికారి. జిల్లా అంతా తన చేతితో ఉంటుంది. అయినా కానీ ఇక్కడ సిగ్గుపడకుండా హలం చేత పట్టి దుక్కి దున్ని అందరిని ఆశ్చర్య చకితులను చేశారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గుత్తి కోయగూడెంలో అటుగా వెళ్తున్న ఆ అధికారి అక్కడ సాగు చేస్తున్న పొలంలోకి వెళ్లి వ్యవసాయం పనుల్లో నాగలి పట్టి దుక్కి దున్నారు ములుగు ఏఎస్పి సాయి చైతన్య ఐపిఎస్. వ్యవసాయ పనులు చేయడం తనకు ఎంతో ఇష్టమైన పని అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు.