జేసీబీతో వీపు గోకించుకున్న పెద్ద మనిషి
జేసీబీని సాధారంగా చిన్నచిన్న ఇండ్లను కూల్చేందుకు లేదా మట్టిని తవ్వేందుకు వాడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీపును గోకేందుకు వాడుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. ఓ వ్యక్తి వీపును జేసీబీతో గోకించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 41సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో ఓ వ్యక్తి టవల్‌తో వీపును గోక్కుంటూ.. అక్కడనే ఉన్న జేసీబీ దగ్గరకు వెళ్లాడు. కిందకు వంగగా జేసీబీలో ఉన్న ఓ వ్యక్తి దానికి కిందకి దించి అతని వీపుపై పెట్టి కింది నుంచి పైకి వెళ్లే విధంగా చేశాడు.
ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. నవ్వించేందుకే ఈ వీడియో తీశారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడగా, అలా చేయడం ప్రమాదకరమని, మరోసారి ఇలా ఎవరూ చెయ్యెద్దని మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఉన్నవారు ఎక్కడివారు, ఎప్పుడు జరిగిందనే విషయాలు వెల్లడి కాలేదు.