మానవత్వానికి మారు పేరు ఏస్.ఐ జాకీర్ హుస్సేన్

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు చాంద్రాయణగుట్ట ఏస్.ఐ జాకీర్ హుస్సేన్. నగరంలోని ఓపెన్ ఐస్ సొసైటీ అనాథ ఆశ్రమంలోని పిల్లలకు భోజనాలు పెట్టించి, విద్యార్థులకు కావాల్సిన సామగ్రిని అందజేశారు. నిత్యం సేవ కార్యక్రమాలో పాలపంచుకోవడం ఆనందంగా ఉందని జాకీర్ తెలిపారు. ప్రస్తుత కాలంలో అందరూ ఉన్నా అనాధ ఆశ్రమల్లో ఎంతో మంది ఉంటున్నారని వారిలో మార్పు రావాలన్నారు. ఎంతో మంది ఆడపిల్లలు కూడా అందరూ ఉన్నా కొన్ని ఆశ్రమాల్లో ఉంటున్నారు, ఆడపిల్ల పుట్టింది అని చెత్త కుప్పలు, రోడ్ల మీద పడేస్తున్నారు ఎలా జరిగినంత కాలం వీళ్లు ఇక్కడే ఉండాల్సి వస్తుందన్నారు. మార్పు వచ్చినప్పుడు సమాజం మారుతుందని పేర్కొన్నారు.