దుబ్బాక ఎన్నికలపై స్కెచ్ వేసిన భాజపా
త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ మేరకు నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో దుబ్బాక ఎన్నికల విషయంపై సన్నాహక సమావేశాం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారు, రఘునందన్ రావు, లక్ష్మణ్, రాజసింగ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేయాలన్నారు. నిజామాబాద్ ఫలితమే ఇక్కడ కూడా రావాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రచారంలో అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపాలన్నారు. భాజపా ఓట్లను చిల్చడానికే కత్తి కార్తీకను వారే రంగంలోకి దింపారు అని పేర్కొన్నారు. ఎలాంటి కుట్రలు చేసిన వెనక్కి తగ్గకుండా గెలుపును సాధించాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.