కేసీఆర్ కి ముంచుడే తెలుసు : హర్షవర్ధన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆగం చేయడానికే కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు అని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి. ఎల్ ఆర్ యెస్ పేరుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ ఆర్ ఎస్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు. ధనికులకు లబ్ది చేకూరేలా సీఎం వ్యవరిస్తున్నారు అని ఆరోపించారు. ఇప్పుడు ఎల్ ఆర్ ఎస్ రాబోయే రోజులలో టాక్స్ ల పేరుతో ప్రజలను ముంచే ఆలోచనలో ఉన్నారు అని అన్నారు.