కత్తి కార్తీకతో తొక్క కూడా తీయలేరు : అరుణ
కత్తికార్తీకతో దుబ్బాకలో తొక్కకూడా తీయలేరు ఘాటైన వ్యాఖ్యలు చేశారు సిద్దిపేట జిల్లా భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ రెడ్డి. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అక్కడ హారీష్‌రావు తన మైండ్ గేమ్ ఆడుతారని ఆరోపించారు. యువత ఓట్లు చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కత్తి కార్తీకతో యువత పక్కదారే పట్టే ఆలోచన లేదని, భాజపా యువత ఎప్పుడూ రఘునందన్‌రావుతో ఉంటారని తెలిపారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా కమలం పువ్వు వీచే గాలిలో కారు కొట్టుకపోవడం ఖాయమన్నారు. యువత దృష్టి మళ్లీంచడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతాయన్నారు. సిద్దిపేట, గజ్వేల్ మధ్యలో ఉన్న దుబ్బాకకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఎన్నికలు రాగానే వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, కుంత్రాలు చేసిన భాజపాకు అడ్డులేదని చెప్పారు.