మీ సేవలకు సలాం : కొలగట్ల

డెక్కన్ న్యూస్ , విజయనగరం : గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం స్థాపనకు శ్రీకారం చుట్టి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్న సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి ఇ వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నగరంలోని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నివాసం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు రాత్రి 7 గంటల సమయంలో చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తూ సచివాలయాల సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న దేశాన్ని నిర్మించడంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందంజలో నిలిచారన్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు తీసుకురావడం ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గా చరిత్రలో నిలిచిపోతారు అన్నారు. భవిష్యత్తులో సచివాలయం ద్వారా మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారు నాయుడు తో పాటు కార్పొరేటర్ అభ్యర్థులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.