న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : ప్రియాంక గాంధీ
దేశంలో సంచలనం సృష్టించిన హత్రస్ ఘటనపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము అని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు, సోనియాగాంధీ కుమార్తే ప్రియాంకా గాంధీ. ఓ దళిత మహిళకు భాజపా ప్రభుత్వం ఇచ్చే తీరు చూసి దేశం మొత్తం సిగ్గుతో తలదించుకుంది అన్నారు. అధికార పార్టీకీ చెందిన వారి హస్తం ఉంది కాబట్టి పోలీసులు అంతా వారికి సహకరిస్తున్నారు అని ఆరోపించారు. బాధిత మహిళకు ఏమి ఇచ్చి న్యాయం చేస్తారు అని ప్రశ్నించారు.