గాంధీజీనే మనకు ఆదర్శం : శ్రావణి

జాతిపిత గాంధీజీ ఆశయసిద్ధి కి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జాతిపిత గాంధీ మరియు మాజీ ప్రధాని దివంగత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఎమ్మెల్యే కోలగట్ల నివాసంలో ఘనంగా జరిగాయి. గాంధీ చిత్రపటానికి, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసతో స్వాతంత్రాన్ని సముపార్జించిన మహాత్మా గాంధీ జీవితం, ఆయన భావాలని, చేసిన కృషిని, సాధించిన విజయాలను తలచుకుంటే ఆయన మానవజాతి భవితవ్యాన్ని కమ్ముకున్న కారు మబ్బుల మధ్య మెరిసిన శాంతి కిరణం వంటివారిని కొనియాడారు. భారత దేశం బాగుపడాలంటే గ్రామ పునరుద్ధరణ జరగాలని, గ్రామాల్ని బాగు చేయాలని గాంధీజీ పదే పదే చెప్పేవారు అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి అందరికీ అందేలా చేస్తున్న మానవతామూర్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు ఆశపు వేణు, సీనియర్ మాజీ కౌన్సిలర్ ఎస్ వి వి రాజేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, ఎఎంసి వైస్ చైర్మన్ రెడ్డి గురుమూర్తి, జిల్లా యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బొడశింగి ఈశ్వరరావు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు అల్లు చాణక్య, పార్టీ నాయకులు విజయ శంకర్ దుబే, అవనాపు లక్ష్మణరావు, పట్నాన పైడి రాజు, పిన్నింటి సూర్యనారాయణ, కనకల గిరి, కనకల కృష్ణ, బూదూరు లక్ష్మణరావు, ద్వాదశి వేణు, షకీల్, వెంపటాపు శ్రీనివాసరావు, తాళ్లపూడి పండు, మారోజు శ్రీనివాసరావు, శ్రీమతి బోనేల ధనలక్ష్మి, దాసరి సత్యవతి తో పాటు పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.