పీఆర్టీయూ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జానారెడ్డి
నల్గొండ జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శిగా మేకల జానారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గత నెల 30 పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నిక అనివార్యంమైంది. దీంతో తమ సంఘంలో మొదటి కార్యదర్శిగా ఉన్న జానారెడ్డినే ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్ తెలిపారు. ఈ సందర్భ్ంగా జానారెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ సంఘం బలపడేలా కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారం చేసేలా చూస్తామన్నారు. అలాగే కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైన తమ దృష్టికి తీసుకరావలన్నారు.