సీఎం మనవుడిపై అన్ని పుకార్లేనా
తన ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాన్ష్ రావు. తాను గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి తీవ్రగాయాలు అయినట్లు, నడవలేకపోతున్నట్లు, నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు పలు పత్రికలు, సోషల్ మీడియా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో హెచ్చరిక లాంటి ప్రకటనతో ట్వీట్ చేశారు హిమాన్ష్. తనకు జరిగింది చిన్నపాటి గాయమేనని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి పరుగులు తీయగలనని స్పష్టం చేశారు. అయితే గోరంతను కొండంతలుగా చేస్తున్న కొన్ని పత్రికలు దుష్ప్రచారం మానుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడంలో ప్రతిపక్షాలు దిగజారిపోతున్నారని, మూడో తరాన్ని సైతం వదలడంలేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.