నవంబర్‌ 3న దుబ్బాక ఉపఎన్నిక

దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటిం చింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 9న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును విధించారు. నవంబర్‌ 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే సిద్దిపేట జిల్లా పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. 2020 జనవరి 1 అర్హత తేదీగా (ఓటర్ల నమో దుకు) ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ను దుబ్బాక ఉప ఎన్నికల కోసం వినియోగిం చనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉన్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఈసీఐ ఆదేశించింది.