లోన్ మారటోరియం కేసు..అక్టోబర్ 5కు విచారణ వాయిదా
మారటోరియం కాలంలో వడ్డీ మాఫీపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది..గత విచారణలో కోర్టు కోరిన వివరాలను సొలిసిటర్ జనరల్ ఇవ్వలేపోయారు..వివరాల సమర్పణకు మరికొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. మారటోరియంపై కేంద్రం, ఆర్బీఐ వివరాలను సమగ్రంగా తెలపాలని గతంలోనే సొలిసిటర్ జనరల్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం అడిగింది..కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుది దశలో ఉందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేంద్రానికి మరికొంత గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది..గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది..మరోవైపు మారటోరియం కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించే అవకాశమున్నదని కేంద్రం తరుఫున అటర్నీ జనరల్ గతంలో కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే తరువాత విచారణలో బ్యాంకులకు నష్టం కలిగించే నిర్ణయం కేంద్రం తీసుకోబోదని అన్నారు..దీంతో వడ్డీపై వడ్డీ అంశంలో కేంద్రం ఏం చెప్పదలచుకున్నదో అన్నది అర్థం కాకుండా ఉన్నది. దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది..అలాగే తగిన ఆదేశాలు జారీ చేసేంత వరకు మారటోరియం వినియోగించుకున్న రుణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బ్యాంకులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మారటోరియం గడువు ఆగస్టు 31తో ముగిసిపోయింది..దీంతో దీన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలు కేంద్రం నిర్ణయం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.