రకుల్ ప్రీత్ సింగ్ కి తెలంగాణ మంత్రులతో సంబంధం ఉంది : సంపంత్ కుమార్
నటి రకుల్ ప్రీత్ సింగ్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రులకు సంబంధం ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. ఇందుకోసమే డ్రగ్ కేసులో తనని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. ముంబై డ్రగ్ కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రకుల్ ప్రీత్ సింగ్ కేంద్ర ప్రభుత్వ పథకమైన భేటీ పడవో భేటీ బచావో పథకానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నారని ఆయన వివరించారు.
గతంలో హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ కుంభకోణంలో అనేక మంది సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని వారిపై రోజుల తరబడి విచారణ జరిపి తర్వాత ఎలాంటి చర్యలు లేకుండా తొక్కి పెట్టారని, ఇప్పుడు బొంబాయి డ్రగ్స్ మాఫియా కేసు లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని, ఆమెకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు..
ఈ సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసు లోతైన విచారణ జరిపితే ప్రభుత్వ పెద్దలు బాగోతాలు బయట పడతాయని అన్నారు.