వేశ్యా వాటికలవుతున్న మసాజ్ సెంటర్లు
హైదరాబాద్ నగరంలో మసాజ్ సెంటర్ల పేరుతో వేలాది స్పాలు కొనసాగుతున్నాయి. ఈ స్పాలలో మసాజ్ పేరుకు మాత్రమే…జరిగేది వ్యభిచారమే.
హైదరాబాద్, సికింద్రాబాద్ లలో ఉన్న స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు నిత్యకృత్యం. కౌంటర్ లో చెల్లించేది రెండు వేలలోపు మాత్రమే…మసాజ్ రూములో మాత్రం మూడు నుంచి అయిదు వేలు అమ్మాయికి ఇస్తే ఇక శృంగారంలో మునిగిపోవచ్చు. కొన్ని మసాజ్ సెంటర్లలో నిర్వాహకులే కస్టమర్లకు కండోమ్స్ అందిస్తూ వ్యభిచార రొంపు కొనసాగిస్తున్నారు. పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా స్పా సెంటర్లు మాత్రం ఇంతకంటే అయ్యేదేముంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.