అలుగెలుతున్న ధరిపల్లి, సూరారం చెరువులు
మెదక్ ప్రతినిధి శ్రీకాంత్ చారి:
గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని ధరిపల్లి, సూరారం చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో రైతులలో ఆనందరం వెల్లివిరిసింది. ఈసారి ఎక్కువగా పెద్దఎత్తున్న వరి పంటలు వేశారని అధికారులు చెబుతున్నారు. అయితే సకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పంటలకు మంచి నీటి లభ్యత దొకిందని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా అక్కడక్కడ వరదలు కొన్ని పంటలకు నష్టం వాటిల్లిందని సమాచారం. ధరిపల్లిలోని కాశీం చెరువు, సూరారంలోని పెద్ద చెరువు అలుగు పోస్తున్నాయని అధికారులు తెలిపారు. కాగా ధరిపల్లి శివారులోని పెద్దవాగు, చిన్నవాగు కూడా వరద వస్తుందని రైతులు తెలిపారు.