రెడ్డిల ఐక్యత పెరగాలి : అరుణ
రెడ్డి సామాజిక వర్గంలో ఐక్యత పెరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు రెడ్డి ఐకాస మహిళా నాయకురాలు గాడిపల్లి అరుణారెడ్డి. సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఐకాస జాతీయ అధ్యక్షుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డిలలో కూడా అనేక మంది పేదవారు ఉన్నారని వారిని అండగా రెడ్డి ఐకాస ఉంటుందని తెలిపారు. మెడికల్ సీటు పొంది ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న బుస్సాపూర్‌కి చెందిన విద్యార్థినికి 25వేల ఆర్థిక సాయం అందజేశారు.