మెద‌క్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ స‌స్పెండ్‌

మెదక్ జిల్లా ల్యాండ్ ఇష్యూలో రూ.కోటి 12లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసులో నలుగురు అధికారులపై వేటు పడింది. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ బుధవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈకేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ఏసీబీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.