హైదరాబాద్లో దంచి కొడుతున్న వాన
హైదరాబాద్లో వానలు దంచి కొడుతున్నాయి. గత కొన్ని గంటలుగా ఉరుములతో కూడిన వానలు పడుతుడటంతో రహాదారులన్ని జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఎవరూ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి రాకూడదని సూచించారు. బేగంపేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అత్తాపూర్, పంజాగుట్టా, ఉప్పల్ ప్రాంతాల్లో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తోతట్టు ప్రాంతాలన్ని జలమయం కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.