ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే పద్మ
మెదక్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదు కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం చేసినా రామాయంపేట ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని ప్రశ్నించారు. అసెంబ్లీలో గళం విప్పిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు.
కరోనా వైరస్ వల్ల గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి భయపడుతున్నారు, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నారు.
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.