దుబ్బాకలో పట్టు సాధించేది ఎవరు ?
రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడంతా దుబ్బాక ఎన్నికల మీద పడింది. శాసనసభ సమావేశాల అనంతరం అన్ని పార్టీలు సీరియస్గా ఎన్నికల ప్రచారం మీద దృష్టి పెట్టన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల మీద సమావేశమైంది. మరోవైపు తెరాస కూడా ఎలగైన దుబ్బాకలో పట్టుకోల్పోవద్దు అనే కృత నిశ్చయంతో ఉన్నారు. ఇక భాజపా ఎలాంటి సవాలు వచ్చినా ఈసారి రఘునందన్ రావు గెలుపు ఖాయం అన్నట్లు నిబ్బరంతో ఉన్నట్లు సమాచారం. అయితే తెరాసలో ఇప్పటి వరకు ఎవరు పోటీ చేస్తారు అనేది ఇంకా తేలకపోవడంతో పార్టీలో తర్జాన భర్జానాలు పడుతున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్తిగా కత్తి కార్తీక కూడా తెర మీదకు రావడంతో దుబ్బాక పోరు రసవత్తరంగా మారింది.