భాజపా మహిళా నేతల అరెస్ట్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరపాలని సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణా రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, మహిళ నేతలతో కలిసి చేశారు.
అసెంబ్లీ గేటు ముందు ధర్నా నిర్వహించడంతో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి గోషామాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్, నరేష్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఎలికట్టె సురేష్, సాయి మహిళా మోర్చా నేతలు జ్యోతి , లక్ష్మి , విజయ పాల్గొన్నారు.