ర‌ఘునంద‌న్‌రావు గెలుపే ల‌క్ష్యం : అరుణ

దుబ్బాక‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు సిద్దిపేట జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణ‌. ఎన్ని అడ్డంకులు సృష్టించిన త‌మ గెలుపును ఎవ‌రూ అడ్డుకోలేర‌ని వ్యాఖ్యానించారు. తెరాస పార్టీ గురించి ప్ర‌జ‌ల‌కు ఎప్పుడో తెలిసిపోయింద‌ని అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాన్ని ఏ రైతు కూడా వ‌దులుకోలేర‌న్నారు. ప్ర‌ధానంగా యువ‌త పెద్ద ఎత్తున్న ర‌ఘునంద‌న్ గారికి మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని చెప్పారు. మ‌రోవైపు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో అనేక మంది తెరాస‌, కాంగ్రెస్ నేతుల భాజ‌పా చేరుతున్నార‌ని తెలిపారు. భాజ‌పా గెలుపు కోసం మ‌హిళా మోర్చా కూడా సంఘ‌టితంగా పోరాడుతోంద‌న్నారు. భారీ మెజార్టీతో గెలుపు ఖాయ‌మ‌ని ఆమె జోస్యం చెప్పారు.