గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి రాష్ట్రప‌తి ఫోన్ అందుకేనా?

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ విద్యా విధానంపై రాష్ట్రపతి శుక్రవారం తమిళిసైతో ఫోన్‌లో సంభాషించారు. విద్యావేత్తలతో నిర్వహించనున్న వెబ్‌నార్‌ గురించి గవర్నర్‌ తమిళిసై ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి, వైస్‌ ఛాన్సులర్లు పాల్గొంటారు. కాగా ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వెబ్‌నార్ నిర్వహించిన విషయం విదితమే.