దౌల్తాబాద్‌లో ఘ‌నంగా జ‌న‌సేనాని జ‌న్మ‌దిన వేడుక‌లు

మెదక్ డెక్కన్ న్యూస్ ప్రతినిధి, శ్రీకాంత్ చారి: జ‌న‌సేన పార్టీ అధినేత, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన వేడ‌క‌ల‌ను తెలంగాణ‌లోని దౌల్తాబాద్ మండ‌లంలో ఘ‌నంగా నిర్వ‌హిచారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికే జ‌న‌సేన పార్టీ ఉంద‌న్నారు మండ‌ల నాయ‌కులు హ‌రీష్‌రాజ్‌. కాగా చిత్తూరు జిల్లాలో ముగ్గురు అభిమానులు చనిపోవ‌డం క‌లిచివేసింద‌న్నారు. ఇందుకు పార్టీ నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా విచారం వ్య‌క్తం చేశార‌ని తెలిజేశారు. ప‌వ‌న్ అభిమానులు ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తున్నార‌ని అన్నారు. ఈ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో న‌వీన్‌, న‌రేష్‌, శ్రీకాంత్‌, బాబు, రాజు త‌దిత‌రులు పాల్గొ్న్నారు.