ఆయన ఎర్రబెల్లినా.. ఎర్రపిల్లినా… : బట్టి విక్రమార్కా
కరోనా కష్ట కాలంలో జనాలను గాలికొదిలేసినందుకు ప్రజలే ముఖ్యమంత్రి కేసీఆర్ తోలు ఒలుస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. బుధవారం ఆయన నేతృత్వంలోని సీఎల్పీ బృందం వరంగల్ ఎం.జీ.ఎం ఆస్పత్రిని పరిశీలించింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో పేదల కోసం ఎంజీఎం ఆస్పత్రిని నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. ఈ ఆరేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆస్పత్రి అభివృద్ధికి చేసిందేమి లేదని మండిపడ్డారు.
ఎర్రబెల్లివా.. ఎర్రపిల్లివా:
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని భట్టి లెక్కలతో సహా వివరించారు. మొత్తంగా ఎంజీఎంలో 651 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అయినా.. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ఈ ఆరున్నారేళ్లుగా కేసీఆర్ గాడిదలు కాస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. వీటి సంగతి పట్టించుకోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… ఎర్రబెల్లా లేక ఎర్రపిల్లివా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.