తెరాసలో కరోన కల్లోలం
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే దంపతుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో బుధవారం పరీక్షలు చేశారు. రిపోర్టుల్లో ఇద్దరికీ పాజిటివ్ ఉన్నట్లు వచ్చింది. ప్రస్తుతం వారిద్దరు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకొని.. క్వారంటైన్‌లో ఉండాలని కోనేరు కోనప్ప సూచించారు.
తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గొంగిడి సునీత, కూన వివేకానంద గౌడ్, ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, కోనేరు కోనప్ప, మాజీ మంత్రి కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు కరోనా బారినపడ్డారు.