గాంధీ కుటుంభం నుండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండాలి : సుంకర పద్మశ్రీ
దేశంకోసం ప్రాణత్యాగాలు , పదవుల త్యాగాలు చేసిన ఘన చరిత్ర గాంధీ కుటుంబానిధిని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ . ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వ్యక్తిత్వం గాంధీ కుటుంబానిదని పేర్కొన్నారు. అటువంటి ఘనచరిత్ర వున్న గాంధీ కుటుంభంనుండే పార్టీ అధ్యక్షులుగా కోనసాగాలని దేశంలోని లక్షలాది మంది కాంగ్రెస్ వాదుల ఆకాంక్ష . కాంగ్రెస్ వాదుల ఆకాంక్షకు అనుగుణంగా శ్రీమతి సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలో కొనసాగాలని లేనిపక్షంలో యువనేత శ్రీ రాహుల్ గాంధీ లేదా శ్రీమతి ప్రియాంక గాంధీ ఈ పదవి చేపట్టాలని సవినయంగా కోరారు. . ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమును మాత్రమే కాంగ్రెస్ వాదులు ఆమోదిస్తారు తప్ప ఇతరులను ఆమోదించరు .