సెక్స్ చేస్తూ జూమ్ మీటింగ్.. కౌన్సిలర్ల సమావేశంలో షాకింగ్ ఘటన

కరోనా వైరస్ నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాసులు జూమ్ లేదా ఇతరాత్ర వీడియో కాన్ఫిరెన్సుల ద్వారా తమ ఉద్యోగులతో సమావేశం అవుతున్నారు. అయితే, ఇంటి నుంచి పని అంటే అంత సులభమైన విషయం కాదు. ఆఫీసులో ఉండేంత సౌలభ్యం ఇంట్లో ఉండదు. ఎవరో ఒకరు మనల్ని డిస్ట్రబ్ చేస్తూనే ఉంటారు. లేదా అనుకోకుండా మీటింగు మధ్యలోకి వస్తారు. కొందరు మీటింగ్‌లో వీడియోలు ఆఫ్ చేయకుండా చిలిపి పనులు చేస్తూ అడ్డంగా బుక్కైపోతుంటారు. ఇదిగో ఈ ఉద్యోగి కూడా ఇలాగే దొరికిపోయాడు. కౌన్సిలర్ల మీటింగ్‌లో సీరియస్ విషయం చర్చ జరుగుతుంటే.. అతడు మాత్రం సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అతడి కెమేరాను ఆపకుండానే ఆ పనిచేయడంతో అంతా అతడి ఘనకార్యాన్ని లైవ్‌లో చూసేశారు.
బ్రెజిల్‌లోని రియో డి జనీరో మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు నగర సమస్యలపై చర్చించేందుకు జూమ్ వీడియో మీటింగ్‌లో సమావేశమయ్యారు. కరోనా వైరస్ సమయంలో విద్యార్థులకు ఆహార, వసతి సదుపాయాల గురించి సీరియస్‌గా చర్చిస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి మీటింగును పట్టించుకోకుండా.. అతడు బెడ్ మీద నిద్రిస్తున్న యువతితో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇదంతా కౌన్సిలర్లు, మీటింగ్ ఛైర్మన్ స్క్రీన్లపై కనిపించింది.
దీంతో షాకైన ఛైర్మన్.. ఆ వ్యక్తి వివరాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మీటింగులో క్రమశిక్షణ పాటించకుండా సెక్సులో పాల్గొన్నందుకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియరాలేదు. అయితే, ఈ షాకింగ్ సీన్ చూసిన తర్వాత కూడా కౌన్సిల్ మీటింగ్ నిరంతరాయంగా కొనసాగించడం గమనార్హం. ఆ వ్యక్తి కౌన్సిలర్ కాదని, స్టాఫ్ మెంబర్ అని తెలిసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.