ఆ ప్రాజెక్టుల నుంచి కేసీఆర్‌కి ముడుపులు అందుతున్నాయి : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సింది పోయి దొంగలా మారి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అండదండలతోనే జగన్ చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్‌కు కమీషన్లు అందుతున్నాయని ఆరోపించారు. జీవో 69ని అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చకపోతే కోర్టుకు వెళతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.