యువ‌తలో రాజ‌కీయ చైత‌న్యం రావాలి : ప‌్ర‌వీణ్‌కుమార్‌

యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడే స‌మాజంలో మార్పు మొద‌లవుతుంద‌ని యువజన సంఘాల సమితి మండల అధ్యక్షుడు కుమ్మరి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆ దిశ‌గా అడుగులు ప‌డిన‌ప్పుడే వివేక‌నంద స్వామి ఆశ‌యాలు నేర‌వేరుతాయ‌ని పేర్కొన్నారు.
చిన్న‌శంక‌రంపేట మండలంలోని చందంపేట గ్రామంలో హనుమాన్ సేవాసమితి యువజన సంఘం యూత్ క్లబ్‌ని ఆయ‌న ప్రారంభించారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన బాధ్య‌త యువ‌త‌పై ఉంద‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు. హనుమాన్ సేవాసమితి యువజన సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ఉపాధ్యక్షులు సాయి కుమార్ యువజన సంఘం సభ్యులు తాటికొండ దాము ప్రేమ్ కుమార్ దుర్గం నవీన్ గౌడ్ దుర్గం రాజు శ్రవణ్ కుమార్ కృష్ణ గోపాల్ చింటూ సందీప్ నాయిని ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.