సెప్టెంబర్ 16 నుంచి పరీక్షలకు రెడీ అవుతున్న జేఎన్టీయూ
కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ ఇంజనీరింగ్, ఫార్మసీ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు జేఎన్టీయూ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 16 నుంచి పరీక్షలు పెట్టాలని ప్రైమరీగా డిసిషన్ తీసుకుంది. ప్రస్తుతం బీటెక్, బీఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ కు మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మిగిలిన సెమిస్టర్ స్టూడెంట్స్ ను ప్రమోట్ చేయనున్నారు. ఐతే కరోనాతో బాధపడుతున్న స్టూడెంట్స్ మాత్రం పరీక్షలు రాసేందుకు రావద్దని కోరుతున్నారు. వేరే రాష్ట్రాల స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కు రావాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని వాళ్లను పరీక్షలకు రావద్దని సూచిస్తున్నారు. వీరికోసం 45 రోజుల తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నారు. జేఎన్టీయూ పరిధిలో బీటెక్, బీ ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ దాదాపు 70 వేల మంది ఉన్నారు. వేరే రాష్ట్రాలకు చెందిన వారు 2 వేల వరకు ఉన్నారు.