కేసీఆర్ చెబితేనే చేస్తారా లేక‌పోతే ప‌ట్టించుకోరా : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

రాష్ట్ర మంత్రుల‌కు క‌నీసం మాన‌వ‌త దృక్ప‌తం కూడా లేకుండా పోయిందని తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. ఓ వైపు వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణం నీటిలో తేలిఆడుతుంటే…. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు క‌నీస సృహ లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న చేస్తున్నామ‌ని చెప్పిన వారు…. ప్ర‌జ‌ల ప‌ట్ల ఎంత చిత్త‌శుద్ది ఉందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. సీఎం చెప్ప‌క‌పోతే వ‌రంగ‌ల్ వెళ్ల‌రా అని ప్ర‌శ్నించారు. సీఎంకి రాష్ట్ర మంత్రులు బానిస‌లై బతుకుతున్నార‌ని ఆరోపించారు. ఒక్క వ‌రంగ‌ల్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెరాస నాయ‌కులు క‌బ్జాల‌కు పాల్ప‌డ‌డం వ‌ల్లే కుంటులు, చెరువులు, నాలాలు కుదించుకుపోతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైన మంత్రులు సొంత నిర్ణ‌యాలు తీసుకొని ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని హిత‌వు ప‌లికారు.