కొడుకు గల్ఫ్‌లో కోడలిపై కన్నేసిన మామ
కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా పరిధిలోని లింగాపూర్ లో మామ కోడలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. . వివరాల్లోకి వెళితే వేములవాడకు చెందిన మల్లేశం లింగాపూర్ లో నివసిస్తున్నాడు. నిందితుడి మొదటి భార్యకు పిల్లలు కలగక పోవడంతో మొదటి భార్య సొంత చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పుట్టిన కుమారుడే రాకేష్. రాకేష్ వివాహం అయ్యింది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లాడు. అయితే కొడుకు గల్ఫ్ లో ఉండడంతో కోడలిపై కసాయి మామ కన్నేశాడు. నిత్యం లైంగింక వేధింపులకు గురిచేసేవాడు. తాజాగా ఆ లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేని బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన కోడలి పట్ల మామ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహానికి గురైన బాధితురాలి నిందితుణ్ని చితకబాది పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.