తెలంగాణలో 700 దాటిన కరోనా మరణాలు
తెలంగాణలో కొత్తగా 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 92,255కు చేరింది. మరో 10 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 703కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 2006 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 70,132 కు చేరింది. 21,420 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 147,రంగారెడ్డిలో 85 కరోనా నమోదయ్యాయి.