గణేష్ మండపాలకు అనుమతి లేదు
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడైనా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అలాగే ఎటువంటి ఊరేగింపులు చేయరాదని, డిజె, బ్యాండ్ సౌండ్లకు కూడా అనుమతి లేదన్నారు. కరోన వైరస్ వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.