నదిలా మారిన ఓరుగల్లు
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న వరంగల్. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. కొంతమంది కబ్జాకోరుల వల్ల నాళాలు ముసుకపోవడంతో వర్షపు నీరు రోడ్ల మీదకు చేరింది. దీనితో రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహాలలో, వ్యాపార సముదాయంలో వాన నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.